ఇండియా పాక్ దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే. రెండు దేశాల మధ్య బోర్డర్‌లో నిత్యం పెద్ద కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో అని చెప్పి అణ్వాయుధాలను తయారు చేస్తుంటారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ ఏ దేశంలో ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి అనే అంశంపై వివరణ ఇచ్చింది. ఈ సిప్రి లెక్కల ప్రకారం ఇండియా కంటే పాక్‌లోనే అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని తేల్చిచెప్పింది. చైనాలో 350, పాక్‌లో 165, ఇండియాలో 156 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నాయని తెలిపింది. గతెడాది జనవరిలో చైనాలో 320, పాక్‌లో 160, ఇండియాలో 150 న్యూక్లియర్ వార్‌హెడ్‌లు ఉన్నాయని తెలిపింది.