డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2019లో వూహన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా మహమ్మారి సమయంలో వూహన్‌లో అప్పట్లో కఠినమైన నిబంధనలు అమలుచేశారు. కరోనా సోకిన వారికి ఇళ్లలో ఉంచి బయట తాళాలు వేశారు. ఐరన్ బార్స్‌తో తలుపులు తెరుచుకోకుండా చేశారు. కరోనా నుంచి కొలుకునే వరకు ఇంటి నుంచి ఎవర్నీ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డెల్టావేరియంట్ ఆ దేశంలో విజృంభిస్తుండటంతో మరోసారి కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా సోకిన ఓ వ్యక్తి ఇంట్లో ఉండి బోర్ కొట్టడంతో బయటకు వచ్చాడు. విషయం తెలుసుకున్న వైద్యసిబ్బంది వెంటనే అక్కడికి వచ్చేశారు. బయటకు వచ్చిన వ్యక్తిని ఇంట్లోకి పంపించి డోర్‌కు తాళాలు వేశారు. ఐరన్ బార్స్‌తో తలుపు తెరుచుకోకుండా మేకులు కొట్టారు. దీంతో చైనాలో పరిస్థితులు మళ్లీ మొదటికి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.