China: పాకిస్తాన్ మిత్రదేశం చైనా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా చైనాలో జనాభా తగ్గదల కనిస్తోంది. ముఖ్యంగా, పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి చైనా యువత ఆసక్తి చూపించడం లేదు. దీంతో జననాల రేటు పడిపోతోంది. ప్రస్తుతం, చాలా దేశాలు జనాభాను తమ వ్యూహాత్మక ఆస్తిగా పరిగణిస్తున్నాయి. చాలా దేశాల్లో యవ జనభా తగ్గిపోయి, వృద్ధ జనాభా పెరుగుతోంది. దీంతో ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి.
China: పొరుగు దేశమైన చైనా ప్రస్తుతం గగ్గోలు పెడుతోంది. ఆ దేశంలో నానాటికీ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సంతానోత్పత్తి విపరీతంగా పడిపోయింది. పిల్లలను కనడమే అక్కడ జనం మానేశారు. దీని ప్రభావం అక్కడి దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుండటంతో చైనా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ క్రమంలోనే జనాభా పెంపు కోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.