Chinese Provinces Give 30 days Paid Marriage Leave To Boost Birth Rate: ఒకప్పుడు ఇబ్బడిముబ్బడిగా జనాభా పెరిగిపోవడంతో.. చైనా ప్రభుత్వం ‘ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు’ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. జనాభాను నియంత్రించడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే.. రానురాను అది ఆ దేశ జనాభాపై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. జనాభాను పెంచేందుకు చైనా ప్రభుత్వం అనూహ్యమైన సిద్ధాంతాల్ని తీసుకొస్తోంది. ఒక బిడ్డ విధానానికి స్వస్తి పలికి.. ముగ్గురు పిల్లల్ని కనాల్సిందిగా పిలుపునిచ్చింది. అనేక రకాల ప్రోత్సాహకాలనను అందించింది. అందులో పన్ను తగ్గింపులు, ఆస్తి పన్ను రాయితీలు సైతం ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా చైనా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లైన జంటలకు నెల రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక పీపుల్స్ డైలీ హెల్త్ వెల్లడించింది.
Ericsson: ఇక ఎరిక్‌సన్ వంతు.. ప్రపంచవ్యాప్తంగా 8,500 ఉద్యోగాలు తొలగింపు
నిజానికి.. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు చైనా కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తారు. అంతకుమించి ఇవ్వరు. అయితే.. జననాల రేటుని పెంచేందుకు కొన్ని ప్రావిన్స్‌లలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. ‘‘చైనాలోని కొన్ని ప్రావిన్స్, నగరాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా మానవ వనరులలో పెరుగుదల అవసరం కాబట్టి.. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి సెలవులు పొడిగించి, దేశవ్యాప్తంగా జననాల రేటును పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని సౌత్‌వెస్ట్రన్ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో డీన్‌గా పనిచేస్తున్న యాంగ్ హయాంగ్ తెలిపారు. కాగా.. గతంలో చైనా అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ వల్ల.. 1980 నుంచి 2015 వరకు జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గింది. దీంతో.. దేశంలో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగింది.
Harry Brook: హ్యారీ బ్రూక్ వరల్డ్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్