శ్రీకాకుళం జిల్లాలో నేడు ఐదు సంవత్సరాల లోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. కాగా విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి సైతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు. సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరపరిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ,…
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కాగా థర్డ్ వేవ్ లో ఎక్కువ శాతం మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరిముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకపోవటమే…
వైరస్ వ్యాప్తి ప్రమాదంతో పోలిస్తే, తల్లి తన శిశువుకు పాలు పట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే. తాజాగా నేషనల్ నియోనాటల్ ఫోరం తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, నిలోఫర్ వైద్య నిపుణులు మరిన్ని సందేహాలకు వివరంగా సమాధానమిచ్చారు. తల్లిపాలతో శిశువులకు వైరస్ సోకదని, తల్లికి పాజిటివ్ వచ్చినా బిడ్డకు పాలు పట్టవచ్చు అన్నారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టాలి, కరోనా స్వల్ప లక్షణాలున్నా నేరుగా…
తల్లి తండ్రి ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్ లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూతనిస్తున్నారు. తిరిగి తల్లి తండ్రి లకు కోవిడ్ నెగిటివ్ వచ్చే వరకు చైల్డ్ కేర్ లో పిల్లలను ఉంచవచ్చు అని సీపీ సజ్జనార్ తెలిపారు. చైల్డ్ కేర్ లో ఉంటున్న పిల్లల పట్ల అన్ని జాగ్రతలు తీసుకుంటాం అని చెప్పిన సీపీ…