దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కాగా థర్డ్ వేవ్ లో ఎక్కువ శాతం మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరిముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకపోవటమే మంచిదని తెలిపింది. వ్యాధి తీవ్రత బట్టి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికే స్టెరాయిడ్స్ ఇవ్వాలి. వైరస్ లక్షణాలు తక్కువగా ఉంటే యాంటీ మైక్రోబయల్స్ మందులు ఉపయోగించకూడదని తెలిపింది. చిన్న చిన్న లక్షణాలతో పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదని, ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వివరించింది.