శ్రీకాకుళం జిల్లాలో నేడు ఐదు సంవత్సరాల లోపు బిడ్డలున్న తల్లులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరగనుంది. కాగా విదేశాల్లో చదువు, ఉద్యోగం నిమిత్తం వెళ్లేవారికి సైతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు. సంబంధిత పత్రాలు చూపించిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విదేశాలకు వెళ్లేవారికి శ్రీకాకుళం నగరపరిధిలోని దమ్మలవీధి పట్టణ ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇక నెల్లూరు జిల్లాలోను అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆశ వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు.