అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం రెండో వారంలోనూ సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. టికెట్ ధరపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. పాఠశాల యాజమాన్యాల కోసం ప్రత్యేకంగా…
వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
మానవత్వం మంటగలిసిపోతుంది. సభ్య సమాజం ఈసడించుకునేలా వ్యవహరించాడో లారీ డ్రైవర్. గుంటూరులో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ లారీ డ్రైవర్ కిరాతకం ఓ మహిళ మృతికి కారణం అయింది. పిల్లలు అనాథలుగా మారారు. గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి వచ్చిందో మహిళ. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చిందా మహిళ. గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి…
సాగరతీరం విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. ఆర్అండ్ అతిథి గృహం వద్ద స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి శిశు గృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శిశు గృహ సంరక్షకులు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి రోడ్డుపై ఉన్న ముగ్గురు చిన్నారులను వారం రోజుల క్రితం గుర్తించిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు శిశు గృహంలో చేర్చారు. తల్లిదండ్రులు వచ్చేంత వరకు రక్షణగా…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 27న ఆదివారం పల్స్ పోలియోను అధికారులు నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అనంతరం రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నాడు హెల్త్, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్…