మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు.…
చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది.
చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.ఆరేళ్ల వరకు పిల్లల మానసిక ఎదుగుదల వేగంగా ఉంటుంది. వారి స్వచ్ఛమైన మనసు తల్లిదండ్రులు, సమాజం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటుంది. అలాగే అనేక కొత్త విషయాలు, కొత్త పనులు, మాటలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులు వారి పెంపకం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మాట తీరు, వాతావరణం పిల్లలకి అనుగుణంగా ఉండాలి. ఇక 6 నుంచి 7 ఏళ్ల లోపు పిల్లల…
పిల్లల్తో హోమ్ వర్క్ చేయించడం, పరీక్షలకు ప్రిపేర్ చేయించడం పేరెంట్స్‌కు పెద్ద టాస్క్. ఎందుకంటే వారిని పట్టుమని పది నిమిషాలైన కదురుగా కూర్చోబెట్టలేం. అటు ఇటు పరుగెత్తడం, కదలడం వంటివి చేస్తుంటారు. దీనికి కారణం పెద్దల కంటే పిల్లల్లో తక్కువ శ్రద్ధ ఉండటమే. పిల్లల గరిష్ట శ్రద్ధ వారి వయస్సు కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. చదువుపై శ్రద్ధ పెట్టేందుకు, పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ…
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉండేలా ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తుంది. ఆన్లైన్ నుంచి పిల్లలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.
హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడికి దిగుతున్నాయి.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ముగ్గురు తల్లులు పతకాలు సాధించారు. బ్రిటన్‌కు చెందిన వెటరన్ హెలెన్ గ్లోవర్.. న్యూజిలాండ్ క్రీడాకారిణులు లూసీ స్పూర్స్, బ్రూక్ ఫ్రాన్సిస్‌లు ఉన్నారు. మహిళల డబుల్ స్కల్స్‌లో స్పూర్స్.. ఫ్రాన్సిస్ బంగారు పతకాన్ని గెలుచుకోగా, మహిళల ఫోర్‌లో ముగ్గురు పిల్లల తల్లి గ్లోవర్ రజతం సాధించింది. కాగా.. స్పూర్స్, ఫ్రాన్సిస్ తమ ఆట ముగిసిన అనంతరం లైన్ దాటి.. తమ బిడ్డలను కౌగిలించుకోవడానికి స్టాండ్‌లలోకి వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ నగరంలో మంగళవారం హింస చెలరేగింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు బాలికలను చంపినందుకు నిరసనగా ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దాడి ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు.. యువకులపై 17 ఏళ్ల యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ 'మా ప్రాణాలకు భరోసా ఏది' అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.. చిన్నారులను బయటికి…