కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు…
ఛత్తీస్‌గఢ్ లో కిడ్నాప్ చేసిన గిరిజనులను వదిలి పెట్టారు మావోయిస్టులు. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని కిడ్నాప్ చేసారు మావోయిస్టులు. అయితే నిన్న అర్ధరాత్రి ఆ ఐదుగురు గిరిజనులను వదిలిపెట్టారు మావోయిస్టులు. ఇద్దరిని చితకబాది హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు… ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను అడవిలోకి ఎత్తుకెళ్లరు మావోయిస్టులు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.…
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటే కొందరూ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మావోల కీలక నాయకుడైనా హిద్మా కోసం పోలీసుల గాలింపులు ఆగడం లేదు. మావోలకు పట్టున్న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోనూ వారు ఉనికిని కోల్పోతున్నారు. తాజాగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోలు లొంగిపోయిన అనంతరం జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్…
పెట్రో ధరల మంట మండుతోంది.. పెట్రోల్ బంక్‌కు వెళ్లాలంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి దాపురించింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.110ను క్రాస్ చేసింది లీటర్ పెట్రోల్ ధర.. ఇక, డీజిల్ ధర కూడా తానే తక్కువ అనే స్థాయిలో పెరుగుతూనే ఉంది.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.120 మార్కును కూడా దాటేసింది.. డీజిల్ ధర రూ.110కిపైగానే ఉండడంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి…
పంజాబ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కెప్టెన్ రాజీనామా తరువాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చన్నిని ఎంపిక చేసింది. చన్నీ ప్రమాణ స్వీకారం తరువాత పీసీపీ అధ్యక్షుడు సిద్ధూ రాజీనామా చేయడం, ఆ తరువాత రాజీ కుదరడంతో తిరిగి ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో అక్కడ ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. పంజాబ్ రాజకీయాలను రాజస్థాన్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రులు వెయికళ్లతో గమనిస్తున్నారు. పంజాబ్ లో జరిగినట్టుగానే రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లో కూడా జరిగే…
పంజాబ్ రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రిని మార్చేశారు. గత కొంతకాలంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు నుంచే కెప్టెన్‌కు, సిద్ధూకు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, సిద్ధూ చాలా కాలం క్రితం నుంచి తనను తాను సీపీపీ అధ్యక్షుడిగా చెప్పుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో తన నేతృత్వంలోనే పంజాబ్ కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నాడు. దానికి తగినట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం వద్ధ పావులు కదిపారు. పైగా రాహుల్‌గాంధీకి, ప్రియాంక గాంధీకి సిద్ధూకి…
మావోయిస్టు కీలక నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు కీలక నేత మోతీరామ్‌ను అరెస్ట్ చేశారు.. మోతీరామ్‌పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. గతంలో సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బంధించి.. చంపిన ఘటనలో మోతీరామ్ కీలక సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. మోతీరామ్‌పై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి.. కాగా, ఈ మధ్య మావోయిస్టు ఉద్యమానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి.. ఈ మధ్యే ఖమ్మం…
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్…