ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అడవికి వెళ్లి విడిపించుకున్న భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్‌కేర్నీలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన సబ్ ఇంజనీర్ అజయ్‌రోషన్, అటెండర్ లక్ష్మణ్‌ను ఈ నెల 11వ తేదీన కిడ్నాప్ చేశారు మావోయిస్టులు.. అయితే, మరుసటి రోజు లక్ష్మణ్‌ను వదిలిపెట్టినా.. సబ్ ఇంజనీర్‌ను తమ దగ్గరే పెట్టుకున్నారు.
Read Also: ఏపీలో సముద్ర తీరంలో బంగారం.. ఎగబడుతున్న జనం..!
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
మరోవైపు ఆ సబ్ ఇంజినీర్‌ను మావోయిస్టుల చెర నుంచి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు… దీంతో.. ఆయన భార్యే రంగంలోకి దిగింది.. కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి అడవి బాట పట్టింది.. రెండేళ్ల కుమారుడితోపాటు అడవిలో అన్నల వద్ద ఉన్న తన భర్త కొరకు బయల్దేరింది.. ప్రాణాలకు తెగించి భర్త కోసం అడవిని జల్లెడ పట్టింది.. ఈ నెల 13, 14, 15, 16వ తేదీల్లో మీడియా ప్రతినిధులతో కలిసి బైక్‌పై అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గూడేల్లో భర్త కోసం వెతికింది.. రోజుకు 30-40 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు.. చివరకు ఐదు రోజులకు మావోయిస్టుల శిబిరానికి చేరుకున్న సబ్ ఇంజినీర్ భార్య అంకిత.. మావోయిస్టులతో చర్చలు జరిపింది.. మీడియా సమక్షంలో జరిగిన ఈ చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు.. అనంతరం సబ్ ఇంజినీర్ అజయ్‌ను విడిచిపెట్టారు.. తన భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టినందుకు మావోయిస్టులకు కృతజ్ఞతలు తెలిపింది అంకిత.. మావోయిస్టులతో చర్చలు జరపడంలో.. స్థానిక మీడియా ప్రతినిధులతో పాటు స్థానికులు కూడా కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఇక, తన భర్తను చూసి తీవ్ర ఉద్వేగానికి లోనై.. ఆయన కౌగిట్లో ఒదిగిపోయింది అంకిత.. అయితే, వారం రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న అజయ్ రోషన్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!