ఓ సీఎం తండ్రిపై కేసు నమోదు కావడమే సంచలనంగా మారగా.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం చర్చగా మారింది.. ఇక, ఆ అరెస్ట్‌ను సీఎం సమర్థించారు.. చట్టం ముందు సమానులేనని స్పష్టం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ తండ్రి నంద్‌కుమార్ బఘెల్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. చత్తీస్‌గఢ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. బ్రహ్మణ సంఘం నేతల ఫిర్యాదుతో నంద్‌కుమార్ ను…
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు… బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.. కాగా, బ్రాహ్మణులను విదేశీయులుగా పేర్కొన్న నంద్‌కుమార్ బాఘేల్.. వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.. అయితే, ఈ ఘటనపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు.. నంద్ కుమార్ బాఘేల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ.. రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(బీ) కింద…
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో… కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఒక రాష్ట్రం వివాదం ముగిసిందనుకుంటే… మరో రాష్ట్రంలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా… నాయకులు గళమెత్తుతున్నారు. మొన్న రాజస్థాన్, నిన్న పంజాబ్, తాజాగా చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్ వ్యవహారం క్లోజ్ అయిందనుకుని… ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త లొల్లి షురూ అయింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా……
భార్యతో భర్త బలవంతంగా శృంగారం చేయడాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్ గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య మైనర్ (వయసు 18 ఏళ్లు లోపు) కాకుండా ఉన్నప్పుడు, ఆమెపై బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కాదని జస్టిస్ ఎన్కే చంద్రవన్షీ ధర్మాసనం తేల్చి చెప్పింది. అత్యాచారం అభియోగం ఎదుర్కొంటున్న ఓ భర్తను నిర్దోషిగా ప్రకటించింది. అయితే, దీనిపై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ‘మనం వినాల్సిన వాటిలో…
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఆమె వెనుకాడదు. ఆమె ఏం అనుకున్నా కూడా మొహం మీదే కుండబద్దలు కొడుతుంది. తాజాగా ఓ రేప్ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పుపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యతో…
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా చింతగుఫ్ఫ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనను ఎస్పీ సునిల్ శర్మ ధృవీకరించారు. అయితే ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగునున్న నేపథ్యంలో యస్టియఫ్, సీఆర్పీఎఫ్ జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసుల విస్తృత తనిఖీలు చెప్పటింది. ఎన్కౌంటర్ లో ఓ మావోయిస్టు మృతి మృతదేహాం స్వాధీనం చేసుకున్నారు. మృతులు పెరిగే అవకాశం ఉందని తెలిపిన ఎస్పీ సునిల్ శర్మ.. ఆపరేషన్ చింతగుఫ్ఫలో మావోయిస్టులకు పోలీసులకు…
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ ఆఫీసర్ జీపీ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు.. అక్రమాస్తుల కేసులో జీపీ సింగ్‌ను గత వారమే సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు.. అయితే, ఆయన ఇంట్లో సోదాల సందర్భంగా.. ఏసీబీ, ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు కొన్ని కీలకమైన కాగితాలు దొరికాయి.. రెండు వర్గాల మధ్య విబేధాలు సృష్టించేలా.. శతృత్వాన్ని పెంచేలా.. ఘర్షణలకు దారితీసేనలా.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై కుట్ర పనినట్టు ఆరోపిస్తున్న పోలీసులు.. జీపీ…
ఛత్తీస్‌గడ్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని కేసును ఫైల్ చేశారు. పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Read: సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ! గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కేంద్రప్రభుత్వం ఆవు పేడను కిలో…
ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లా ఏప్రిల్ 28న జవాన్ మనోజ్ నేతమ్ ,ను అపహరించుకు పోయిన మావోయిస్టులు,జవాన్ మనోజ్ ను హత్య చేసినట్లు ధృవీకరించారు.ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.ఐతే మనోజ్ మృతదేహాన్ని అనివార్య కారణాల వల్ల కుటుంబ సభ్యులకు చేరవేయనందుకు చింతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.ఐతే కరోనా మహమ్మారి దండకారణ్యం లో ఇప్పటికే విలయతాండవం చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి.పలు చోట్ల కరోనా చోకిన మావోలు చికిత్స కోసం మైదాన ప్రాంతానికి రావటం, కొంతమంది…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో పేరుతో ప్రకటన విడుదల చేశారు. సిల్గేర్లో పెట్టిన సీఆర్పీఎఫ్ క్యాంపు ఎత్తివేయాలని ప్రజలు చేపట్టిన ఆందోళనలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారు మావోయిస్టు సభ్యులని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఘటనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. సిల్గేర్…