దేవుడా ఎంతటి విచిత్రం.. మానవులు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారు. మనిషిని పుట్టించిన దేవుడికే కోర్టు నోటీసులు ఇస్తున్నారు. దేవుడిని విచారణకు హాజరు కావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హాజరు కానీ పక్షంలో 10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ఇదెక్కడి విధి వైపరీత్యం.. ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు అంటే.. బిలాస్ పూర్ హైకోర్టు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఒక శివాలయం ఉంది. అయితే ఆ శివాలయాన్ని అక్రమంగా ఆక్రమించిన స్థలంలో కట్టారని, శివాలయంతో సహా మొత్తం 16 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని సుధా రాజ్ వాడే అనే మహిళ కోర్టులో కేసు వేసింది. ఇక ఈ కేసును విచారించిన బిలాస్ పూర్ హైకోర్టు శివుడితో సహా 10 మందికి సమన్లు జారీ చేసింది. అంతేకాదండి.. వారు విచారణకు రాకపోతే రూ.10,000 జరిమానా విధించడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇదెక్కడి విడ్డూరం.. కోర్టుకు శివుడు ఎలా వస్తాడు.. అయినా శివాలయం మీద కేసు వేస్తే .. ఆ గురి దర్మకర్తపైనో, ఆలయ పూజారిపైనో కేసు వేయాలి కానీ డైరెక్ట్ గా శివుడి మీద కేసు వేయడం ఏంటి..? అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.