Earthquake: దేశంలో ఇటీవల కాలంలో పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం ధాటికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ లో 4.1 తీవ్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లోని భట్గావ్ ప్రాంతంలో భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.
Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్‌గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో…
Instagram Reels: ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్ గా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. వ్యూస్ పెరగడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చత్తీస్ గఢ్ లో జరిగింది. ఇన్స్టాగ్రామ్ రీల్ మోజులో పడి ప్రాణాలు…
Crime News: అనుమానం.. ఒక పెనుభూతం. ఒక్కసారి మనిషి మెదడులోకి అనుమానం వచ్చిందంటే.. చచ్చేవరకు పోదు. ఆ అనుమానంతో ఏదైనా చేయడానికి రెడీ అవుతారు కొందరు. తాజాగా ఒక భర్త అనుమానం.. భార్య ప్రాణాలు తీసేసింది.
Woman Fights Wild boar: ఎంతటి కష్టం వచ్చినా కూడా తన బిడ్డలను కాపాడుకుంటుంది అమ్మ. తన పిల్లలకు కష్టం వస్తుందంటే ఎందాకైనా పోరాడుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగింది. తన కూతురును రక్షించుకోవడానికి 30 నిమిషాల పాటు అడవి పందితో పోరాడింది. చివరకు తాను ప్రాణాలు కోల్పోయి, కూతురును రక్షించుకుంది. ఈ విషాదకర సంఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో జరిగింది. తల్లి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది ఈ ఘటన.
Maoists Letter : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలోని జాగర్‌గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
Chhattisgarh Baloda Bazar road accident: రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రతీ రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, అజాగ్రత్త కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భటపరా జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.