Theif : మంచి దొంగ.. దొంగతనం చేసి తిరిగి తెచ్చి పెట్టేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theif : మనం అనేక దొంగతనాల వార్తలు వినే ఉంటాం. దొంగలు కొన్ని సమయాల్లో క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. అవసరమైతే బెదిరించడం, కొన్న సందర్భాల్లో ప్రాణాలను సైతం తీసి దొంగతనాన్ని కానిచ్చేస్తుంటారు. కానీ ఇలాంటి దొంగలు మాత్రం చాలా అరుదు. ఓ దొంగ దొంగతనం చేసిన తర్వాత, దొంగిలించిన నగదును తిరిగి ఎక్కడ తీశాడో అక్కడే పెట్టాడు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన వార్తే. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిల్హా ప్రాంతంలో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. ఈ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు చోరీకి గురైంది… అయితే ఆశ్చర్యకరంగా మరుసటి రోజు చోరీ మొత్తం రికవరీ చేయబడింది.
Read Also: Bandi Sanjay Released Live: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
శోభరామ్ కోష్లే అనే వ్యక్తి గ్రామంలోని తన భూమిని రోహిత్ యాదవ్ అనే వ్యక్తికి విక్రయించాడు. ఈ భూమిని మార్చి 27న రిజిస్ట్రేషన్ చేశారు. సమాచారం ప్రకారం శోభరామ్ కోశ్లే భూమిని విక్రయించి నగదు అందుకున్నారు. ఈ నగదులో 95 వేల రూపాయలను శోభారామ్ తన ఇంటి నేలమాళిగలో దాచాడు. కానీ, మరుసటి రోజు శోభారం బాక్స్‌తో పాటు మొత్తం చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ ఘటన తర్వాత శోభరామ్ ఏప్రిల్ 1న బిల్హా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులకు, శోభరామ్‌కు షాక్ కలిగించే సంఘటన జరిగింది. పోలీసులు దొంగ కోసం వెతుకుతున్నారు. అకస్మాత్తుగా ఇంటి ఆవరణలో శోభరామ్ తన వద్ద ఉన్న నగదుతో కూడిన పెట్టెను గుర్తించాడు. ఈ పెట్టెలో 95 వేల రూపాయలు ఉన్నాయి. అయితే దొంగ ఇలా ఎందుకు చేశాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు అతన్ని పట్టుకుని చర్యలు తీసుకుంటారనే భయంతోనే ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు.
Read Also: Bandi sanjay: కరీంన’గరం’లో గరం.. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్
- Tags
- bilaspur
- Chhattisgarh
- money
- police
- theif
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?