Raipur Crime: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మహిళా వైద్యురాలు మోసపోయిన ఉదంతం వెలుగు చూసింది. మ్యాట్రిమోనియల్ సైట్లో నకిలీ ఐడీలు సృష్టించి నిందితులు మహిళలను తమ వలలో వేసుకునేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అందిన కాడికి సొత్తు మొత్తాన్ని దోచుకునేవారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన విచిత్రమైన సంఘటనలో, రిజర్వాయర్‌లో పడిపోయిన తన ఖరీదైన ఫోన్‌ను తిరిగి పొందేందుకు రిజర్వాయర్ నుంచి 21 లక్షల లీటర్ల నీటిని తోడేసినందుకు ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు.
Congress: కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. గత 34 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఓట్లను, సీట్లను సంపాదించింది. మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తే 135 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అంతకుముందు ఏడాది హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇదిలా ఉంటే మరింత దూకుడుగా ఈ ఏడాది చివర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కర్ణాటక ఊపునే ఈ…
Immoral Relation : ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భార్యను అల్లుడుతో ఆ స్థితిలో చూసి ఆగ్రహించిన భర్త హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.
Pre-wedding shoots harmful for brides: ఈ మధ్య కాలంలో పెళ్లి కన్నా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. చిత్రివిచిత్రంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కాంట్రవర్సీలకు, ప్రమాదాలకు కూడా కారణం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించి ఛత్తీస్‌గఢ్ మహిళ కమిషన్ చైర్పర్సన్ కిరణ్మయి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధామ్తరి జిల్లాలో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బొలెరో ట్రక్కును ఢీకొట్టడంతో 10 మంది అక్కడిక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స జరుగుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ లే లక్ష్యంగా మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో 10 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన ఓ జవాన్ దహన సంస్కారాల్లో హృదయ విదారక దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త మృతిని తట్టుకోలేని మహిళ గుండెలవిసేలా రోదించింది.
Bus Overturns in Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మోహ్లా మన్పూర్లో బస్సు బోల్తా పడింది. చిన్నారులతో సహా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. దోండి లోహరా ప్రాంతం నుంచి కురేత గ్రామానికి బయలుదేరిన బస్సు శుక్రవారం బోల్తా పడటంతో ప్రయాణికులు గాయపడ్డారు.
దండకారణ్యలో ఉన్నత స్థాయి టేకు చెట్లు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా చాలా పొడవుగా ఉంటాయి. దండకారణ్యంలో వసంతకాలం తర్వాత వచ్చే శరదృతువు మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో నక్సలైట్ల సంఘటనలు ఒక్కసారిగా పెరుగుతాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. 10 మంది పోలీసుల మరణించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకున్నాయి. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు బుధవారం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తున్న 10 మంది భద్రతా సిబ్బందితో పాటు డ్రైవర్‌తో కూడిన వాహనాన్ని పేల్చివేశారు.