chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లో ఓ వింత కేసు ఎదురైంది. తాను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని హత్య చేశానని, అతను ఇప్పుడు కలలో వచ్చి హింసిస్తు్న్నాడంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బాలోద్ జిల్లాలో ఈ వార్త కలకలం రేపింది. సదరు వ్యక్తి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం, హత్యకు గురైన వ్యక్తిని పూడ్చి పెట్టిన స్థలం కోసం అధికారులు వెతుకులాట ప్రారంభించారు. బాలోద్ జిల్లాలోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియా అనే వ్యక్తి 2003లో ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని హత్య చేసి అడవిలో పూడ్చి పెట్టానట్లు గ్రామస్తులతో చెప్పాడు.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ కిడ్నాప్
కాగా, ఛవేశ్వర్ ఇప్పుడు తన కలలో వచ్చి నిత్యం హింసిస్తున్నాడంటూ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతడు చెప్పిన వివరాలతో గ్రామ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. అయితే మృతదేహం లభించలేదు. ఇదిలా ఉంటే కొలియారా మానసిక ఆరోగ్యం బాగా లేదని పోలీసులు అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ ఛవేశ్వర్ తండ్రి మాత్రం ఈ వ్యవహారంపై అధికారులను మరోసారి ఆశ్రయించారు. బుధవారం మరోసారి తవ్వకాలు జరిపిన అధికారులు ఓ డ్యామ్ పక్కన కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల కోసం ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. మృతుడు తన భార్యకు స్నేహితుడని, అతడు తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఛవేశ్వర్ ను చంపానని కొలియారా తెలిపారు.