Congress Plenary Meetings: ఛత్తీస్ గడ్ రాజధాని రాయపూర్ వేదికగా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ ప్లీనరీ జరగనుంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది.
Couple Found Dead: కొత్తగా పెళ్లైన జంట నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సి వాళ్లు కానీ, పెళ్లైన తర్వాత రిసెప్షన్ ముందే చనిపోయారు. కత్తిపోట్లకు గురై మరణించినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగింది. ఇద్దరు దంపతులు తమ ఇంట్లోని ఓ గదిలో తీవ్రగాయాలతో శవాలపై కనిపించారు.
Maoists warning letter to Congress: మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ చత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో లేఖను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ లో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది మావోయిస్టు…
సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు.
ఒకప్పుడు తన చేతుల్లో రైఫిల్ పట్టుకున్న తర్వాత, కరణ్ హేమ్లా ఇప్పుడు పెన్ను పట్టుకుని మంచి భవిష్యత్తు కోసం ఛత్తీస్‌గఢ్‌లో పదోతరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. 2005లో బస్తర్ డివిజన్లో నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం 'సల్వా జుడుం' ప్రారంభం కావడంతో హింస చెలరేగడంతో కరణ్ హేమ్లా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది
Elephant Died: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఏనుగు మృతి చెందింది. శనివారం రాత్రి మహాసముంద్లో ఏనుగు మృతదేహం లభ్యమైంది. నారాయణ్ సింగ్ రిజర్వాయర్ కోదార్ ఎడమ గట్టు కాలువలో విద్యుదాఘాతానికి గురై మగ ఏనుగు చనిపోయింది.
Villagers Attack Police : ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ జిల్లాలో పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. సింఘన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌గావ్ గ్రామంలో గురువారం అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి జరిగింది.