ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నక్సలైట్లు ప్రజాకోర్టును నిర్వహించి ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గ్రామస్తులకు మావోయిస్టులు మరణశిక్ష విధించారు. మూడో వ్యక్తిని విడుదల చేశారు. ఈ ఘటన బీజాపూర్‌లో చోటుచేసుకుంది.
Beer Party In School: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న మస్తూరి ప్రాంతంలోని ఓ పాఠశాలలో బర్త్‌డే పార్టీలో విద్యార్థినులు బీరు తాగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్‌లో విద్యార్థినులు బీర్ పార్టీ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఉన్నత అధికారులు విషయాన్ని గ్రహించి వెంటనే విచారణ చెప్పట్టారు. అందిన సమాచారం ప్రకారం, భట్‌చౌరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.…
ఓ వైపు యూపీలో తోడేళ్లు జనజీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. వాటి దాడిలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
Gang Rape: ఛత్తీస్‌గఢ్ లోని జష్‌పూర్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో ఆరుగురు మైనర్ బాలురు సహా మొత్తం ఏడుగురు నిందితులు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జష్‌పూర్ జిల్లాలోని పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 1వ తేదీన సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన బాధితుడు సమీపంలోని మార్కెట్ లోని జాతరను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడలో మంగళవారం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 09 మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం రాయ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సల్స్ దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు. READ MORE: Tragedy:…
రక్షాబంధన్ రోజున ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్తున్న గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆగస్టు 15న జరిగిన ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ముంగేలిలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్ పావురాన్ని పైకి విసిరారు. కానీ అది పైకి వెళ్లకుండా కిందపడిపోయింది.