Flood Effect: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద ప్రవాహాం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కుంట దగ్గర జాతీయ రహదారిపై వరద నీరు పోటెత్తింది. ఈ వరద దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
Maoists Attack : ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) పేల్చడంతో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సిబ్బంది మరణించగా, దంతేవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది గురువారం ఒక మహిళా నక్సలైట్ ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్ లో జరిగిన ఐఈడీ పేలుడులో నలుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది గాయపడగా., అదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో నక్సలైట్లు అమర్చిన పేలుడు పరికరం పేలడంతో రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్…
Coal Mines: ప్రపంచంలో 5 అతిపెద్ద బొగ్గు గనుల్లో ప్రస్తుతం రెండు మనదేశంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(SECL) ఆధ్వర్యంలోని గెవ్రా, కుస్ముండా బొగ్గు గనులు ప్రపంచంలో 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు.
Sati: భర్త మరణించిన తర్వాత కనిపించకుండా పోయిన మహిళ ‘సతీ సహగమనం’ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ జిల్లా రాయగఢ్‌లో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనను ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు.
ప్రతి విద్యార్థి తన భవిష్యత్‌కు మంచి పునాది వేసుకోవాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతగానో శ్రమపడుతుంటారు.. కష్టపడతారు. సమయాన్ని ఎంతగానో సద్వినియోగం చేసుకుంటారు. ఇక లక్ష్యం చేరేదాకా వెనకడుగు వేయరు.
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి దంపతులను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. ఆ వ్యక్తి చాలాసార్లు సివిల్ సర్వీస్ (PSC) పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ అతను బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాలను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఏడు కేంద్రాల్లో 1563 మంది విద్యార్థులు రీ ఎగ్జామినేషన్ కు హాజరుకావాల్సి ఉండగా..అందులో 813 మంది (52 శాతం) పరీక్ష రాశారు.