Beer Party In School: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న మస్తూరి ప్రాంతంలోని ఓ పాఠశాలలో బర్త్‌డే పార్టీలో విద్యార్థినులు బీరు తాగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్‌లో విద్యార్థినులు బీర్ పార్టీ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఉన్నత అధికారులు విషయాన్ని గ్రహించి వెంటనే విచారణ చెప్పట్టారు. అందిన సమాచారం ప్రకారం, భట్‌చౌరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బర్త్ డే పార్టీని సెలబ్రేట్ చేసుకునేందుకు విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే బీర్ పార్టీ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారు. తరగతి గదిలోనే ఒక టేబుల్‌ను బీర్‌తో అలంకరించారు. ఆ తర్వాత వాటిని తాగడం మొదలు పెట్టారు. ఆ తర్వాత విద్యార్థులు మత్తులోకి జారుకున్నట్లుగా సమాచారం.
Brahmanandam: ఎప్పుడు కనిపించని పాత్రలో బ్రహ్మానందం.. డైలాగ్స్ అదిరిపోయాయిగా..(వీడియో)
ఈ సందర్భంగా విద్యార్థులు బీరు సీసాలు, పెగ్గులతో ఫొటోలు, రీళ్లు కూడా తయారు చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలికల ఈ చర్యలో పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారని, అయితే పాఠశాలలో బాలికలు మద్యం సేవించకుండా ఎవరూ ఆపలేదని చెబుతున్నారు. ఇక్కడ పాఠశాలలో బీర్ పార్టీ ఫోటో వైరల్ కావడంతో స్థానికులు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న బీఈవో స్వయంగా పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందిని, విద్యార్థులను విచారించారు. విద్యార్థినులు బీర్ పార్టీ చేసుకుంటున్న ఫొటోలను దర్యాప్తు బృందం గుర్తించిందని బీఈవో తెలిపారు. పాఠశాలలో బీర్ పార్టీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పాఠశాలలో మద్యం సేవించడం తీవ్రమైన విషయం అని., అందువల్ల దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ వ్యవహారంపై తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.