Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, కమిషన్ గౌరవ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనలో రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అలాగే అధికారుల…
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం సంబంధించి మరింత దారుణ వివరాలను బయటపెడుతోంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ పెను ప్రమాదానికి కారణమైన బస్సు, టిప్పర్ లారీపై గతంలో పలు ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సుపై రూ. 2,305…
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరికి సంబంధించిన విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం వికారాబాద్‌లోని అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ.. ఆయన చాకచక్యంగా బస్సును అదుపు చేసి అందులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే, నేడు అదే బస్సు ప్రమాదానికి గురై ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరం.…
Chevella Bus Tragedy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొనడంతో పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారితో సహా తల్లి మృతి చెందింది.
Chevella Accident Causes: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర లోని హైదరాబాద్–బీజాపూర్ హైవేపై నేడు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృత్యువాత చెందారు. ఈ ఘటన రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు సగ భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడడంతో ప్రాణ నష్టం…
Chevella Road Incident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు కుడివైపు భాగం మొత్తం నుజ్జునుజ్జు కాగా.. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24…
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 10 రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు.
Chevella Road Accident: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాల పట్ల తన సానుభూతిని ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ…
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది.