Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, కమిషన్ గౌరవ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనలో రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అలాగే అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు మీడియాలో ప్రస్తావించబడిన నేపథ్యంలో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రవాణా, హోం, గనులు & భూగర్భశాస్త్రం శాఖలు, ఎన్‌హెచ్‌ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీజీ ఆర్టీసీ అధికారుల నుండి పూర్తి స్థాయి నివేదికలను డిసెంబర్ 15, 2025 ఉదయం 11 గంటలకు లోపు సమర్పించాలంటూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Bengaluru: “నీ కోసమే నా భార్యను చంపేశా”.. మహిళలకు డాక్టర్ మెసేజ్..