Chevella Road Incident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు కుడివైపు భాగం మొత్తం నుజ్జునుజ్జు కాగా.. బస్సును ఢీకొట్టిన టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Shree Charani: అలుపెరగని ప్రయాణం.. పేదరికాన్ని జయించి, ప్రపంచ కప్ అందించిన ఆంధ్ర మహిళా క్రికెటర్
మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, లారీ డ్రైవర్‌తో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురి వివరాలను అధికారులు వెల్లడించారు. గుర్తించిన మృతుల్లో తారిబాయ్ (45), కల్పన (45), బచ్చన్ నాగమణి (55), ఏమావత్ తాలీబామ్, మల్లగండ్ల హనుమంతు, గుర్రాల అభిత (21), గోగుల గుణమ్మ, షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్ ఉన్నారు. ఇకపోతే ఈ విషాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు సాయిప్రియ, నందిని, తనూష చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వీరు హైదరాబాద్‌లో చదువుకుంటూ, వీకెండ్ కావడంతో ఇంటికి వచ్చి తిరిగి కాలేజీకి వెళ్లేందుకు ఈ ఉదయం బయల్దేరి వెళ్లారు. ముగ్గురిని వారి తండ్రి బస్టాప్ వద్ద డ్రాప్ చేసిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. వీరితో పాటు బస్సు ప్రమాదంలో లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని అఖిల ప్రియా రెడ్డి కూడా మృతి చెందింది.
Chevella Road Accident: మృత్యు ఘోష.. ప్రధాని దిగ్భ్రాంతి..! మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఇక ఈ ఘోర ఘటనలో గాయపడిన వారిలో వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్ రజాక్, వెన్నెల, సుజాత, అశోక్, రవి, శ్రీను, నందిని, బస్వరాజ్, ప్రేరణ, సాయి, అక్రమ్, అస్లామ్ ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.