Road Accidents: భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీరిన వేగం కారణంగానే జరుగుతున్నట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ తెలియజేస్తుంది. రాత్రివేళల్లోనే అధికంగా రోడ్డు ప్రమాదాలు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. అతి వేగంతో వెళ్లే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురైతున్నట్లు తెలుస్తుంది. హెచ్చరిక బోర్డుల ప్రకారం ఆ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలి.. ఏ మలుపు దగ్గర ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందన్నది క్లియర్ గా ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు పట్టించుకోవడం లేదు..
Read Also: Tragic Incident: విషాదం.. వేడినీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి..
అయితే, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 10 రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాపూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు చనిపోయారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకు ముందు కర్నూలులో 20, రాజస్థాన్లో 15 మంది మరణించడం.. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.