భారత జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీలో అనేక సిరీస్‌లు, ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లే దీనికి నిదర్శనం. ఐపీఎల్ 2023లో అభిమానులు ధోనీ కోసం హంగామా చేశారు. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ గా అదరగొడతానుకుంటే గాయంతో టోర్నీ మొత్తానికి దూరంగా ఉన్నాడు. కీలక ప్లేయర్ అని అనుకుంటే.. ఆడిన రెండు మ్యాచుల్లో దారుణంగా ఫేయిల్ అయ్యాడు. రూ. 16. 25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేస్తే.. కనీసం 16 పరుగులైనా చేయకుండానే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు.
CSK becomes 1st IPL team to have 10M followers on X: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అరుదైన రికార్డు సాధించింది. ఎక్స్(ట్విటర్)లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ’10 మిలియన్ ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న X-ట్రీమ్ ఎల్లోవ్ మరియు ఈలలకు ధన్యవాదాలు’ అని సీఎస్‌కే ఎక్స్‌లో పేర్కొంది.…
నేడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు.. నేటితో మిస్టర్ కూల్ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా మహేంద్రుడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా మహేంద్ర సింగ్ ధోనితో రవీంద్ర జడేజాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
ఓవైపు సంపాదిస్తూనే మరోవైపు.. పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు ధోనీ.. వినోద రంగంలోనూ ఎంట్రీ ఇచ్చారు.. ధోనీ ఎంటర్టైన్‌మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ సంస్థ బాధ్యతలు మొత్తం తనకు పిల్లనిచ్చిన అత్త చేతిలో పెట్టారు.. ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మిస్టర్ కూల్ యొక్క అత్త షీలా సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. వచ్చే సీజన్ ఐపీఎల్ లో ఆడతాడా.. లేదా అనే ప్రస్తుతం అనుమానంగానే కనిపిస్తుంది. అయితే తమ కెప్టెన్ కు భావోద్వేగమైన వీడియోను అంకితమిచింది సీఎస్కే యాజమాన్యం.
ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారింది. బ్యాటర్లు పండగ చేసుకున్న ఈ సీజన్లో ఒక ఇన్నింగ్స్‌లో 200కుపైగా స్కోర్లు అత్యధిక సార్లు నమోదైన రికార్డు నమోదైంది. ఇక సిక్స్‌ల రికార్డు కూడా బ్రేకయింది.