ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట.
ఢిల్లీ వీధుల్లో మొత్తం ఎల్లో జెర్సీతో అభిమానులు మహేంద్ర సింగ్ ధోని వస్తున్న బస్సు కోసం వేచి ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారి పోడవునా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును కూడా వారు చుట్టుముట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం చెన్నై టీమ్ 10 ఓవర్లకు అజేయంగా 87 పరుగులు చేసింది. క్రీజులో సీఎస్కే ఓపెనర్లు రుత్ రాజ్ గైక్వాడ్ ( 37 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు ) హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేస్తున్నారు.