కోట్లు పెట్టి కొంటే చెన్నై జట్టుకి ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఆల్ రౌండర్ గా అదరగొడతానుకుంటే గాయంతో టోర్నీ మొత్తానికి దూరంగా ఉన్నాడు. కీలక ప్లేయర్ అని అనుకుంటే.. ఆడిన రెండు మ్యాచుల్లో దారుణంగా ఫేయిల్ అయ్యాడు. రూ. 16. 25 కోట్లు రికార్డు ధరకు కొనుగోలు చేస్తే.. కనీసం 16 పరుగులైనా చేయకుండానే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఎన్నో అంచనాల మధ్య సీఎస్కే జట్టులో ఈ స్టార్ ఆల్ రౌండర్ చేరడంతో జట్టులో కొండంత బలం చేకూరిందని సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అనుకున్నారు.. కానీ స్టోక్స్ అవసరం లేకుండానే చెన్నై ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచింది. దీంతో ఈ స్టార్ ప్లేయర్ ను సాగనంపేందుకు ట్రై చేస్తున్నారు.
Read Also: MLA Rekha Nayak : ఇప్పుడు అయితే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ ఎంత టాలెంటడ్ ప్లేయర్ అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అయితే, 2022 ఐపీఎల్ కి దూరంగా ఉన్న బెన్ స్టోక్స్.. 2023 వేలానికి అందుబాటులోకి వచ్చాడు. 2022లో పేలవ ప్రదర్శన కనబర్చిన సీఎస్కే.. ఈ సారి ఈ స్టార్ ఆల్ రౌండర్ మీదే నజర్ పెట్టింది. స్టోక్స్ ని ఎలాగైనా దక్కించుకోవాలని ఏకంగా 16. 25 లక్షల రూపాయలను సీఎస్కే యాజమాన్యం ఖర్చు చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. స్టోక్స్ ని తీసుకొని ఎంత పెద్ద పొరపాటు చేశారో లీగ్ ముగిసిన తర్వాత.. కానీ తెలియలేదు.. మొత్తానికి ఈ స్టార్ ప్లేయర్ కి ఇక గుడ్ బై చెప్పాలని అనుకుంది. బెన్ స్టోక్స్ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమ్మిన్స్ ని తీసుకునేందుకు సీఎస్కే ప్లాన్ చేస్తుంది.
Read Also: Bandi Sanjay: ఏపీ సర్కార్‌పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు..
ఇటీవలే స్టోక్స్ వన్డే వరల్డ్ కప్ కోసం తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈ స్టార్ ఆల్ రౌండర్ వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు టాక్. దీంతో అతన్ని విడుదల చేయడమే బెటర్ అని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అనుకుంటుంది. అతని ప్లేస్ లో పాట్ కమ్మిన్స్ ని సెలక్ట్ చేయడం బెటర్ అనుకుంటుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.7.25 కోట్లకు కమ్మిన్స్‌ని కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం చేయడంతో 2023 సీజన్‌లో కమిన్స్ ఆడలేదు. దీంతో ఇతడిపై చెన్నై కన్ను పడింది. మరి చెన్నై తీసుకోబోతున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.