ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది.
ఐపీఎల్లో తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ వచ్చింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యంగ్ పేసర్ మతీశా పతిరణ ఫిట్‌నెస్ సాధించాడు. ఈ విషయాన్ని పతిరణ మేనేజర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్‌కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.
ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ట్రోఫీ సాధించిపెట్టిన సారథి ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా.. కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే ధోని పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్ లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా…