AP CM YS Jagan Review On Sports And Youth Services Department: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో-ఖో వంటి ఆటల్ని ప్రధానంగా ఆడించనున్నారు. ఈ పోటీల్లో అబ్బాయిలే కాదు, అమ్మాయిలూ పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రీడలతో పాటు 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, ఇతర సంప్రదాయ ఆటల పోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. మొత్తం 46 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు జరపనున్నారు.
Fire Accident: కోచింగ్ సెంటర్‌లో భారీగా చెలరేగిన మంటలు.. విద్యార్థులకు గాయాలు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆటల పోటీలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. క్రికెట్‌లాంటి ఆటలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు మార్గదర్శకం చేస్తుందని.. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం సీఎస్కే జట్టుకి మూడు క్రికెట్ మైదానాల్లో శిక్షణ కార్యక్రమాలను అప్పగిస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీ కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకు సాగాలని, దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుందని సూచించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులని.. ఆ ఇద్దరి సేవల్ని మనం వినియోగించుకోవాలని చెప్పారు. మొదట జిల్లా స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలన్నారు.
Pawan Kalyan: వారి తిట్లకు చేతలతో సమాధానం చెప్తా.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూల్, ఆ పై స్థాయిలో తప్పనిసరిగా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.