నేడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు.. నేటితో మిస్టర్ కూల్ 42వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా మహేంద్రుడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా మహేంద్ర సింగ్ ధోనితో రవీంద్ర జడేజాకు ప్రత్యేక అనుబంధం ఉంది.
Read Also: Urvashi Rautela: మొత్తం చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఊర్వశి..
2009 నుంచి ఇప్పటి వరకూ.. ఈ ప్రయాణం ఎప్పటికీ నీతోనే కొనసాగుతుంది.. మహీ భాయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు.. త్వరలో యెల్లో జెర్సీలో కలుద్దాం అంటూ జడ్డూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్2023 ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించిన తర్వాత ధోనీని కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో, జడ్డూ ట్వీట్ వైరల్ గా మారింది.
అయితే.. జడేజా సీఎస్‌కేలో జాయిన్ అప్పటి నుంచే ధోని ఓ అన్నలా అతడికి తోడుగా నిలిచాడు. గతేడాది కెప్టెన్సీ వదులుకుని జడ్డూను తన వారసుడిగా ప్రకటించి పగ్గాలు అప్పగించాడు. ఇందులో భాగంగా మొదటి రిటెన్షన్ ఆప్షన్ లో కూడా జడేజా ఉండాలని ఎంఎస్ ధోని తన స్థానాన్ని సైతం త్యాగం చేశాడు. అయితే, అంతకుముందు సారథిగా అనుభవం లేని జడ్డూ కారణంగా సీఎస్‌కే ఐపీఎల్-2022లో దారుణంగా వైఫల్యం చెందింది. మధ్యలోనే జడ్డూ పగ్గాలు వదిలేయడంతో ధోని మళ్లీ నాయకత్వ బాధ్యతులు తీసుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Read Also: Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. పలు రైళ్ల దారి మళ్లీంపు..!
ఇక.. ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. జట్టు విజయంలో జడేజా కీ రోల్ పోషించాడు. 10 రన్స్ అవసరమైన వేళ.. సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైను గెలిపించాడు. దీంతో కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కొట్టింది. తీవ్ర భావోద్వేగానికి గురైన ధోని జడ్డూ ఎత్తుకుని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు, జడ్డూకు ధోనికి పడట్లేదు అంటూ జరిగిన ప్రచారానికి ఒక్క దెబ్బతో ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇక టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత జడ్డూ సైతం.. మహీ భాయ్ నీకోసం ఏమైనా చేస్తానంటూ ధోనిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
My go to man since 2009 to till date and forever. Wishing you a very happy birthday mahi bhai.🎂see u soon in yellow💛 #respect pic.twitter.com/xuHcb0x4lS
— Ravindrasinh jadeja (@imjadeja) July 7, 2023