Box Office: కోట్లు వసూలు చేస్తున్న సినిమాలు.. రోడ్డున పడుతున్న సైడ్ యాక్టర్లు.. షాకింగ్ రియాలిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Box Office: సినిమా అంటే కొందరికి వినోదం. కొందరికి ఉల్లాసం.. కానీ మరి కొందరికి బతుకుదెరువు. ఎంతో మందికి అన్నం పెడుతోంది సినిమా. ఒక సినిమా రూపొందించాలంటే పదులు, వందలు సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జనాలు అవసరమవుతారు. తెర వెనుక కష్టపడుతున్న కార్మికులు ఏ మేరకు బాగుపడుతున్నారో తెలియదు కానీ.. ప్రత్యక్షంగా తెరపై కనిపించే నటులు అందరూ మూవీస్ వల్ల ఎంతో లాభ పడుతున్నారని అనుకుంటాం. స్టార్ కమెడియన్లు అయితే.. లేక్కలేనన్ని డబ్బులు వచ్చి పడుతుంటాయని భావిస్తాం. నిజంగా సినీ ప్రపంచంలో ఇలాంటి పరిస్థితే ఉందా? ఏళ్లుగా ఇండస్ట్రీలో పని చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు ఆర్థికంగా స్థిరపడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా కనిపించడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా ప్రపంచం మారుతోంది. దీంతో ప్రస్తుతం చాలా మంది సైడ్ యాక్టర్లు రోడ్డున పడుతున్నారు. ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఏమైనా వెనకేసుకున్నారా? అంటే అదీ లేదు.
READ MORE: Sukumar : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కోసం రెండు స్టోరీస్
Also Read
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
తాజాగా బాలీవుడ్‌లో ఇలాంటి ఘటననే ఓ కమెడియన్‌కు ఎదురైంది. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన రాజ్‌పాల్ యాదవ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్టార్ కమెడీయన్ ప్రస్తుతం తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు అనే వార్త ఇండస్ట్రీని కుదిపేసింది. సుమారు 9 కోట్ల రూపాయల అప్పు తీర్చలేక ఆయన కోర్టుకు లొంగిపోయాల్సి వచ్చింది. దాదాపు ముప్పై ఏళ్లుగా సినిమాల్లో పనిచేస్తున్న నటుడు ఈ స్థితికి రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా సైడ్ యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టుల సంపాదనపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పెద్ద హీరోలతో కలిసి నటించినా, వారి స్థాయి ఆదాయం అందరికి ఉండదని చాలామంది చెబుతున్నారు. ఈ చర్చ మధ్యలో ‘వెల్‌కమ్’ సినిమా ఫేమ్ ముష్తాక్ ఖాన్ పేరు సైతం తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం ఆయన కిడ్నాప్ అయిన విషయం అప్పట్లో పెద్ద వార్తైంది. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆయన వద్ద నుంచి ఒక కోటి రూపాయలు డిమాండ్ చేశారు. కానీ ముష్తాక్ ఖాన్ దగ్గర అంత డబ్బు లేదని చెప్పినప్పుడు వారు నమ్మలేకపోయారు. ఇది ఇంటర్వ్యూలో స్వయంగా ముష్తాక్ చెప్పిన క్లిప్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
READ MORE: Coffee for Memory: మతిమరుపునకు చెక్.. 40 ఏళ్ల పరిశోధనలో తేలిన మైండ్ బ్లోయింగ్ విషయాలు!
“నువ్వు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి పెద్ద హీరోలతో పనిచేస్తున్నావు. నీ సినిమా ‘గదర్’ 500 కోట్లు సంపాదించింది. కనీసం నీకు 5 కోట్లు ఇచ్చి ఉంటారు కదా?” అని కిడ్నాపర్లు అడిగారట. దానికి ముష్తాక్ ఖాన్, “అలా కాదు. సినిమా మొదలయ్యే ముందు ఒప్పందం ప్రకారం ఎంత పారితోషికం నిర్ణయిస్తే అంతే ఇస్తారు. సినిమా ఎంత వసూలు చేసినా మాకు అదనంగా ఏమీ రాదు” అని ఆయన వివరణ ఇచ్చినా నమ్మలేదట. ఈ క్లిప్‌ను పంచుకుంటూ సోషల్ మీడియాలో చాలా మంది ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. “రాజ్‌పాల్ యాదవ్, జానీ లీవర్ లాంటి కామెడీ నటులు సైతం ఊహించినంత సంపాదించరు. హీరోలతో కలిసి పనిచేస్తే వాళ్లంతే డబ్బు వస్తుందని ప్రజలు అనుకుంటారు. కానీ వాస్తవం వేరేలా ఉంటుంది” అని కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోల పారితోషికం, సపోర్టింగ్ యాక్టర్ల పారితోషికం మధ్య చాలా తేడా ఉందని చాలామంది చెబుతున్నారు. ఇక రాజ్‌పాల్ యాదవ్ పరిస్థితి తెలిసి కొంతమంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. మేనేజర్ చెప్పిన ప్రకారం.. అజయ్ దేవగన్, సోనూ సూద్, సల్మాన్ ఖాన్, తేజ్ ప్రతాప్ యాదవ్ వంటి పలువురు సాయం చేశారట. త్వరలోనే రాజ్‌పాల్ యాదవ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు చూస్తుంటే.. సినిమాల్లో కనిపించే ప్రతి నటుడూ కోట్లలో సంపాదిస్తాడనే భావన నిజమా? లేక తెరపై కనిపించే వెలుగుల వెనుక అనేక ఆర్థిక ఇబ్బందులున్నాయా? అనే చర్చ బాలీవుడ్ అంతటా హాట్ టాపిక్‌గా మారింది.
READ MORE: NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..
ఇంతకీ రాజ్‌పాల్ యాదవ్ కేసు ఏంటి?
రాజ్‌పాల్ యాదవ్, ఆయన భార్యపై మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెక్‌బౌన్స్ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోగా.. వారు ఇచ్చిన కొన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయని సదరు సంస్థ ఫిర్యాదు చేసింది. దిల్లీ మెజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్ దంపతులను 2018లో దోషులుగా తేల్చి, నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019లో సెషన్స్ కోర్టు కూడా ఈ శిక్షను సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ రాజ్‌పాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ శిక్షపై 2024లో తాత్కాలిక స్టే ఇస్తూ.. రాజీ పడాలని సూచించింది. ఫిర్యాదు దారుడికి డబ్బు తిరిగి చెల్లిస్తానని నటుడు కోర్టుకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో తాజాగా తుది ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!