యవ్వన ప్ర్రాయంలో కొన్ని కొన్ని కోరికలు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ కోరికలు ఎంతటి దారుణాలనైనా చేయిస్తాయి. అలంటి వాటి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉంటే సరే.. లేకపోతే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే యువకుడి జీవితంలా మారిపోతుంది. బోనస్ డబ్బులతో కాల్ గర్ల్ తో ఎంజాయ్ చేద్దామనుకున్న యువకుడి చిన్న పొరపాటు అతడిని ఆసుపత్రి పాలు చేసింది. అతడిపై దాడి చేసి, అతడి వద్ద ఉన్న డబ్బును తీసుకొని పారిపోయారు కాల్ గర్ల్స్. ఈ ఘటన రాజస్థాన్…
వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఆరేళ్ల ప్రేమ వివాహంగా మారుతోందని ఆ అమ్మాయి మోహంలో సిగ్గులు మొగ్గలు వేసింది. ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అంగరంగ వైభవంగా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో పెళ్లి అని ఆనందపడేలోపు యువకుడు షాక్ ఇచ్చాడు. స్నేహితుడి ప్రేయసితో పారిపోవడంతో.. వధువు సహా ఇరు కుటుంబ సభ్యులు షాకయ్యారు. రాజస్తాన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు…
నీతోనే ప్రేమ.. నీవే నా సర్వస్వం అంటూ తిరిగాడు. చివరాఖరికి పెళ్లి మాటెత్తితే ముఖం చాటేశాడు. ఓ ప్రేమికుడి మోసానికి బలయిన యువతి అతని ఇంటిముందే నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామంలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది ఆ యువతి. యువతితో నిశ్చితార్థం చేసుకొని మరో యువతిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. న్యాయం చేయాలంటూ యవకుడి ఇంటిముందు నిరసన తెలుపుతోంది యువతి. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని…
ఆస్తి కోసం కన్న తండ్రినే టెక్నాలజీ వాడి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కొడుకు, కోడలు. హైదరాబాద్ లో ఉంటూ కరీంనగర్ లో ఉన్న సొంత ఇంటికి కన్నం వేసేందుకు కొడుకు రవి తన భార్యతో కలిసి ప్లాన్ వేశారు. ఇందుకు తండ్రి వైకుంఠం ఫోన్ లో కాల్ రికార్డింగ్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి తన జీమెయిల్ అకౌంట్‌కు జత చేసుకున్నాడు రవి. ఈ క్రమంలో తండ్రి ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు, ఆస్తికి సంబంధించిన…
సెలెబ్రిటీల పేర్లతో చీటింగ్ జరగడం చూస్తుంటే ఉంటాము. అయితే ఈసారి మాత్రం కేటుగాళ్లు రూటు మార్చి ఏకంగా స్టార్ హీరో నిర్మాణ సంస్థనే వాడుకున్నారు. సౌత్ ఫిల్మ్ స్టార్ సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పేరును మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ వారి సోషల్ మీడియా ఖాతాలో తమ నిర్మాణ సంస్థ పేరుతో జరిగిన మోసం గురించి షాకింగ్ వార్తను పంచుకుంది. ఒక మోసగాడు వారి లోగోతో పాటు నకిలీ ఇమెయిల్ ఐడిని సృష్టించాడు.…
ఓ మాయలేడీ వలలో పడి న్యూడ్ వీడియో, ఫోటోలతో మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలోని ఓ యువకుడికి గత నెల 30న తన మొబైల్ వాట్సాప్ కు ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ అమ్మాయిదని తెలియడంతో సరదాగా చాటింగ్ సాగించాడు. ఆ పరిచయం పెరగడంతో యువకుడు ఆమె అడిగిన వెంటనే తన ఫేస్ బుక్ ఐడిని షేర్ చేశాడు.…
రాజ్ కుంద్రా మెడకు ఒక్కో కేసు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది. మొదట పోర్న్ వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేశాడన్నారు పోలీసులు. తరువాత న్యూడ్ సెన్సేషన్ పూనమ్ పాండే ఆరోపణలు మొదలు పెట్టింది. తనని కూడా రాజ్ కుంద్రా కంపెనీ వారు మోసం చేశారని ఆమె అంటోంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ నుంచీ మరో కేసు కుంద్రా నెత్తిన పడింది. Read Also : ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’ గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన హిరేన్ పర్మర్ స్వంత…
తిరుపతిలో నిత్య పెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తాను అనాథనని నమ్మించిన ఓ యువతి ముగ్గురు యువకులను పెళ్లి చేసుకుంది. ఇది వరకే ఆమె ఇద్దరిని పెళ్లి చేసుకుందనే విషయం తెలియక ఆమెను వివాహం చేసుకున్నాడు ఓ యువకుడు. కాగా ఆమె అతడి నుంచి ఆరు లక్షల వసూళ్ళు చేసి పరారైయింది. దీంతో మూడో పెళ్లి కొడుకు ఫిర్యాదుతో ఆమె బండారం బట్టబయలైంది. అయితే తాజాగా కొత్తగూడెంకు చెందిన వినయ్… తిరుపతిలో జరుగుతున్న వ్యవహారాన్ని చూసి తాను…
కరోనా ఆర్‌టిపిసిఆర్ పరిక్షలు చేస్తామంటూ ఘరానా మోసం చేసారు. ఇండియా మార్ట్ లోఫోన్ నంబర్ తో లాగిన్ అయిన హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తి కి ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ లు చేస్తామని సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. తన ఇంట్లో పది మంది ఉన్నారని తెలిపాడు బాధితుడు. అతని దగ్గర నుండి డెబిట్ కార్డ్ వివారలు అడిగి ఓటిపి తీసుకున్నారు నేరగాళ్ళు. ఆ ఖాతాలో ఉన్న మొత్తం 2.94లక్షలు కాజేసారు నేరగాళ్ళు. దాంతో హైదరాబాద్…
హైదరాబాద్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. ఇప్పటికే 300 కోట్లు రూపాయలను ఫ్రీజ్ చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే బ్యాంకులలో ఫ్రీజ్ అయిన తమ ఖాతాలను తెరిపించుకునే యత్నం చేస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అధికారుల పేరుతో బ్యాంకులకు ఆదేశాలు, నకిలీ లెటర్ హెడ్, స్టాంపులు వేసి ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన ఢిల్లీ గుర్గావ్ తదితర బ్రాంచులకు పంపించారు. కానీ అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు హైదరాబాద్…