ఫేస్ బుక్ పరిచయాలు, ఆన్ లైన్ స్నేహాలు నమ్మవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ముక్కు, మొహం తెలియనివారికి గుడ్డిగా నమ్మి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువతి తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక యువకుడిని నమ్మి, తన బాధలను చెప్పుకొంది. వాటిని అలుసుగా తీసుకునేం యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని రూమ్ కి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక యువతి పోలీస్ ఉద్యోగం కోసం వేరే ఊరిలో ఉంటూ శిక్షణ తీసుకొంటుంది. అక్కడ తనకు స్నేహితులెవ్వరు లేకపోవడంతో ఎక్కువగా ఫేస్ బుక్ లోనే ఉండేది. కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లో ఆమెకు ఒక యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దీంతో యువతి తాం బాధలను యువకుడితో పంచుకుంది. తనకు ఉద్యోగం కావాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. ఇక ఇదే అదునుగా భావించిన యువకుడు గాల్వియార్ లో ఒక ఉద్యోగం ఉందని, సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాడు.
అతనిని నమ్మి, అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లిన యువతిని, యువకుడు ఒక హోటల్ కి తీసుకెళ్లి అత్యాచారం చేసి, వదిలేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో యువతి మౌనంగా ఇంటికి చేరుకొంది. అయితే తన సర్టిఫికెట్లను అక్కడే వదిలేసి రావడంతో మరోసారి అతడికి కాల్ చేసి తన సర్టిఫికెట్లను ఇవ్వమని అడుగగా.. మరోసారి తన కోరిక తీరిస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో యువతి చేసేడేమో లేక అతడి వద్దకు వెళ్ళింది. ఈసారి కూడా ఆమెపై అత్యాచారం చేసి సర్టిఫికెట్లు లేవు, ఏమి లేవు అంటూ ఆమెను గెంటేశాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గామిపు చర్యలు చేపట్టారు.