మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడు విశాఖపట్నంకు చెందిన రాంగోపాల్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ రాంగోపాల్…ఓ యువతిని ప్లాట్ల పేరుతో మోసం చేసి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ మంత్రి పీఎం అంటూ పలువురు దగ్గర కూడా డబ్బులు వసూలు…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తి నా పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్నాడని నా దృష్టికి వచ్చింది. అతను నాతో పాటు సినిమాల్లో నటించిన వారి నుంచి, ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నట్టు తెలిసింది. నా వైపు నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులతో సంభాషించకండి’ అంటూ తన అభిమానులను…