ఆస్తి కోసం కన్న తండ్రినే టెక్నాలజీ వాడి మోసం చేసేందుకు సిద్ధమయ్యారు ఓ కొడుకు, కోడలు. హైదరాబాద్ లో ఉంటూ కరీంనగర్ లో ఉన్న సొంత ఇంటికి కన్నం వేసేందుకు కొడుకు రవి తన భార్యతో కలిసి ప్లాన్ వేశారు. ఇందుకు తండ్రి వైకుంఠం ఫోన్ లో కాల్ రికార్డింగ్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి తన జీమెయిల్ అకౌంట్‌కు జత చేసుకున్నాడు రవి. ఈ క్రమంలో తండ్రి ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు, ఆస్తికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకున్నాడు.
ఈ నేపథ్యంలో వైకుంఠం హైదరాబాద్ కు వెళ్లేందుకు ఇంటికి తాళం వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన కొడుకు రవి, తన భార్యతో ఇంట్లో ఉన్న రూ.25 లక్షల నగదుతో పాటు ఆస్తి పత్రాలను కాజేశారు. అనుమానం వచ్చి ఫోన్‌లో యాప్‌లను పరిశీలించిన వైకుంఠంకు కాల్ రికార్డింగ్ వ్యవహరం తెలియడంతో బిత్తరపోయాడు. వెంటనే తేరుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.