రాజ్ కుంద్రా మెడకు ఒక్కో కేసు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది. మొదట పోర్న్ వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేశాడన్నారు పోలీసులు. తరువాత న్యూడ్ సెన్సేషన్ పూనమ్ పాండే ఆరోపణలు మొదలు పెట్టింది. తనని కూడా రాజ్ కుంద్రా కంపెనీ వారు మోసం చేశారని ఆమె అంటోంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ నుంచీ మరో కేసు కుంద్రా నెత్తిన పడింది.
Read Also : ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన హిరేన్ పర్మర్ స్వంత రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ తో పాటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కూడా రాజ్ కుంద్రా పై కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఆరోపిస్తున్న దాని ప్రకారం శిల్పా శెట్టి భర్త ఆధీనంలోని ‘వియాన్ ఇండస్ట్రీస్’ అతడ్ని మోసం చేసిందట. 3 లక్షలు తీసుకుని ఓ ఆన్ లైన్ గేమ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ గా చేర్చుకుంటామన్నారట! కానీ, అలాంటిదేం జరగలేదు! ‘గేమ్ ఆఫ్ డాట్’ పేరుతో తనకు 3 లక్షలు ఎగొట్టి ఆటలో అరటి పండుని చేశారని హిరేన్ గ్రహించాడు. కానీ, తరువాత సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్ తో గుజరాత్ వ్యాపారి హిరేన్ పర్మర్ కూడా బయటకొచ్చాడు. మరోసారి తన డబ్బు తనకు ఇప్పించమని ముంబై పోలీసుల్ని సైతం కంప్లైంట్ లో రిక్వెస్ట్ చేశాడు.
2019లో తనకు జరిగిన మోసానికి ఇప్పుడు న్యాయం కోరుతోన్న గుజరాత్ వ్యాపారి హిరేన్, బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, చెబుతున్నాడు. రానున్న రోజుల్లో రాజ్ కుంద్రా బాధితులు అంతకంతకూ ఎక్కువయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కేసులు ఎంతగా పెరిగితే శిల్పా శెట్టికి అంత తలనొప్పి అని చెప్పక తప్పదు…