ఓ మాయలేడీ వలలో పడి న్యూడ్ వీడియో, ఫోటోలతో మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని కొంపల్లి సినీ ప్లానెట్ సమీపంలోని ఓ యువకుడికి గత నెల 30న తన మొబైల్ వాట్సాప్ కు ఓ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ అమ్మాయిదని తెలియడంతో సరదాగా చాటింగ్ సాగించాడు. ఆ పరిచయం పెరగడంతో యువకుడు ఆమె అడిగిన వెంటనే తన ఫేస్ బుక్ ఐడిని షేర్ చేశాడు. వారి మధ్య సాగుతున్న ఆన్లైన్ చాటింగ్ ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్ వరకు వెళ్లాయి. అయితే అవి రికార్డు చేసిన ఆ యువతి బాధితుడిని బెదిరించింది. అతడి ఫోటోలు, వీడియోలు ఫేస్బుక్ లో ఉన్న తన స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికీ పంపిస్తానని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితుడు పలుమార్లు కొన్ని నంబర్లకు ఫోన్ పే ద్వారా పలు దఫాలుగా మొత్తంగా రూ. 23,500 పంపించాడు. అక్కడికి ఆగకపోవడంతో బాధితుడు విసిగిపోయి స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.