రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత నెలకొంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రంగారెడ్డి ఫోక్స్ కోర్టు న్యాయమూర్తిపై ముద్దాయి చెప్పు విసిరాడు. ఫోక్సో కేసులో ముద్దాయిగా ప్రకటించడంతో జిర్ణించుకోలేకపోయిన నిందితుడు.. న్యాయమూర్తిపై ఒక్కసారిగా చెప్పు విసిరాడు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాది.. పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కంగనా కాంట్రవర్సీల చిట్టా పెద్దదే. అయితే, అందులో ప్రధానమైన వాటిని ఏరితే తప్పకుండా మనకు దొరికేవి మహేశ్ భట్, ఆలియా భట్ పై ఆమె చేసిన ఆరోపణలు! కరణ్ జోహర్ తరువాత కంగనా వద్ద నుంచీ అంతగా సెగ ఎదుర్కొంది మహేశ్ భట్, ఆలియానే! నిజానికి మహేశ్ భట్ ‘వో లమ్హే’ సినిమాలో మంచి పాత్రని అందించాడు కంగనాకి. అది ఆమె కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది కూడా. అయినా కానీ, కంగనా ఏనాడూ మహేశ్ ని,…