మనకు విచిత్రమయిన వార్తలు కనిపిస్తుంటాయి. పడగ విప్పి నాట్యం చేసే పాములు ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని పాములు పగబడతాయి. వ్యక్తులు ఎక్కడ వున్నా వెతికి మరీ వారిని కాటేస్తుంటాయి. అయితే పగబట్టడం అనేది పక్కన పెడితే కొన్ని పాములు భయంతో కాటేస్తుంటాయి. కుక్కలు, పిల్లులపై దాడులు చేస్తాయి. అయితే పాముకి ముంగిస కనిపిస్తే అంతే సంగతులు.. రెండింటికి బద్ధ శత్రుత్వం వుంది. ఈ పాము మాత్రం సెపరేట్ ఎందుకంటే ఈ పాము చేసిన పనికి ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.
Read Also: Perni Nani: బాబు కళ్లలో ఆనందం కోసమే.. పవన్ నోట్లో వేలు పెట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు
ఓ పాము ఎక్కడినించి వచ్చిందో గానీ.. వచ్చిందే తడవుగా తన పని కానిచ్చేసింది. ఇంతకీ ఆ పాము ఏం చేసిందంటే.. ఇండ్ల మధ్యకు వచ్చిన పాము కాసేపు కంగారుపడింది. స్థానికులు గట్టిగా అరిచారు. ఆ అరుపులకు పాము కొంచెం బెదిరింది. దాన్ని వెళ్లగొట్టేందుకు స్థానికులు ప్రయత్నిస్తే అక్కడ వున్న ఓ పింక్ కలర్ చెప్పు నోటితో పట్టుకొని పాము వేగంగా వెళ్లిపోయింది. కొంచెం దూరంలో ఉన్న రాళ్ల గోడలోకి పాము దూరిపోయింది. ఇదేం పామురా బాబూ అంటూ అంతా నవ్వుకున్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఆ పాముకి చెప్పు అని తెలీదని, అదేదో తినేదనుకుని పాము నోట కరుచుకుని వెళ్ళిపోయి వుంటుందంటున్నారు. మొత్తం మీద ఈ పాము వ్యవహారం భలేగా అనిపించింది కదూ..
Read Also: Salman Khan: ‘టైగర్ 3’ కోసం వెటరన్ హీరోయిన్