భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక) విజయవంతం అయింది. చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ ను చంద్రుడి దక్షిణ ధృవంపై సురక్షితంగా దిగింది. దీంతో అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుని ఉపరితలంపై సక్సెస్ ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. అలాగే చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ను దించిన మొట్టమొదటి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవంపై ఇప్పటి వరకు ఏ దేశం కూడా అడుగు పెట్టలేదు. ఇక, చంద్రయాన్‌ను మన శాస్త్రవేత్తలు అతి తక్కువ ఖర్చుతో తయారు చేశారు.
Read Also: Floating Wind Park: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ విండ్ పార్క్ ప్రారంభం.. ఎక్కడంటే?
ఇక, చంద్రయాన్-3 విజయవంతంపై పలువురు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన దశను కూడా విజయవంతంగా దాటి చందమామ దక్షిణ ధ్రువ రారాజుగా భారత్ అవతరించడం మహా అద్భుతం అని బండి సంజయ్ అన్నారు. యావత్ భారతదేశం గర్వించాల్సిన క్షణాలివి.. ఇంతటి గొప్ప అద్భుత విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలకు బీజేపీ తరపున శుభాకాంక్షలను బండి సంజయ్ తెలిపారు.
Read Also: Hebah Patel : రెడ్ డ్రెస్ లో మెరిసిన హెబ్బా పటేల్.. కిల్లింగ్ లుక్స్ తో మతి పోగొడుతుందిగా..
నా జీవితం ధన్యం అయింది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. చంద్రయాన్-3ని సక్సెస్ చేసిందుకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సంబరపడుతున్నారు.. చందమామ రావే జాబిల్లి రావే అని మన బామ్మలు పాడితే ఆ చందమామ మీదనే అడుగు పెట్టాము.. తర్వాలో సూర్యుని మీద అడుగు పెడతామని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: Rs.100 Crore Cheque: సింహాద్రి అప్పన్నకు రూ.100 కోట్ల చెక్.. అసలు విషయం తెలిస్తే షాకే..!
చంద్రయాన్-3 విజయం నూతన చరిత్రకు అంకురార్పణ చేయడం జరిగింది అని టీ,బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇస్రో బృందానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. ఒక మైలు రాయిని అధిగమించారు.. ప్రపంచంలో మనం తల ఎత్తుకుని తిరిగే విధంగా చేశారు.. ప్రధాని మోడీ నేతృత్వంలో మనదేశం ఇప్పటికే అంతర్జాతీయ వేదికల పైన జాతీయ పతాకాన్ని గౌరవంతో ఎగురవేస్తూన్నాం.. ఇలాంటి ప్రయోగాలకు శక్తివంతమైన నాయకత్వం కావాలి.. మోడీ ఏవిధంగా శాస్త్రజ్ఞులకు అండగా నిలబడ్డారు.. రష్యా విజయం సాధించలేక పోయింది అని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Viral News: ఈ వ్యక్తి చేతులు ఇలా మారడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షాతిరేకాలు తెలియజేశారు. ప్రధాని మోడీ ప్రోత్సాహంతో ఇస్రో శాస్త్రవేత్తలు సిబ్బంది చంద్రయాన్-2 ప్రయోగ వైఫల్యాలను అధిగమించి ఏ దేశానికి సాధ్యం కానీ, రీతిలో చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను దించడం భారతదేశానికి గర్వకారణమని డీకే అరుణ అన్నారు.
Read Also: Ban Sugar Exports: పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అక్టోబర్ నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం!
చంద్రయాన్ -3 ల్యాండింగ్ సక్సెస్ అయినందుకు ఇస్రో అధికారులకు, దేశ ప్రజలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షాలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది.. చంద్రయాన్ -3 ల్యాండింగ్ విజయంవంతం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాల కల నెరవేరింది.. ఇది ఇస్రో విజయం మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది విజయం అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Chandrayaan 3: చంద్రయాన్ 3 సక్సెస్.. మన స్టార్లు ఏమన్నారంటే.. ?
భైంసాలో చంద్రయాన్-3 ల్యాండింగ్ ను స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎన్టీవీ ద్వారా వీక్షించారు. స్కూల్, షాప్లు అనే తేడా లేకుండా పెద్ద మొత్తంలో ఎన్టీవీలో చంద్రయాన్-3కి సంబంధించి ల్యాండింగ్ విజువల్స్ ను స్థానిక ప్రజలు వీక్షించారు.