చంద్రునిపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత పాకిస్థాన్ పౌరులే పాక్ అంతరిక్ష సంస్థను ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఆహార కొరత ఉందని, అంతరిక్షంలోకి వెళ్లడం గురించి ఎవరు మాట్లాడతారని ప్రజలు అంటున్నారు.
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనుంది.
చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగుపెట్టిన ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించారు.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్‌లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 సురక్షితంగా జాబిల్లిపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల అనంతరం రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం.
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.