Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీమేక్ అన్నా.. బయోపిక్ అన్నా బాలీవుడ్ లో మొదట వినిపించే పేరు అక్షయ్ కుమార్. దేశంలో ఎలాంటి మూమెంట్ జరిగినా..దేశాన్ని మొత్తం గడగడలాడించే ఘటన జరిగినా దానిపై బయోపిక్ తీయడం మేకర్స్ కు అలవాటే. అలాగే దేశ భక్తి సినిమాలు.. వాటిపై బయోపిక్ లు అంటే అక్షయ్ తరువాతే ఎవరైనా.. ఇక ఇప్పుడు అక్షయ్ ఏ బయోపిక్ తీస్తున్నాడు అని ఇదంతా చెప్తున్నారు అంటే.. ఇంకేటి.. చంద్రయాన్ 3 బయోపిక్. అవును.. మీరు విన్నది నిజమే.. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యిందో లేదో. వెంటనే అక్షయ్ కుమార్ ను చంద్రయాన్ 3 బయోపిక్ తీయమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్షయ్.. దేశంలో సెన్సేషన్ సృష్టించిన మిషన్ మంగల్, రామసేతు.. ఇలా బయోపిక్ లు తీస్తూ వస్తున్నాడు. దీంతో చంద్రయాన్ 3 పై కూడా ఒక సినిమ తీసేయ్ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Manmadhudu Re Release Trailer: ఇందులో త్రివిక్రమ్ డైలాగ్స్ ఉంటాయి గురువు గారు.. వేరే లెవెల్ అంతే
అస్సలు చంద్రయాన్ ఎక్కడ మొదలయ్యింది.. అది సక్సెస్ అయ్యే నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఎదుర్కున్న అవమానాలు ఏంటి..? అనేది చూపించమని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే ఫ్యాన్స్ సరదాగానే అన్నా.. అక్షయ్ కు నచ్చితే మాత్రం అస్సలు వదలడు. ప్రయోగాలు చేయడంలో అక్షయ్ ను మించినవారు లేదు. దీంతో అక్షయ్ నిజంగా ఈ బయోపిక్ చేస్తాడేమో అని సందేహపడేవారు కూడా ఉన్నారు. ఒకవేళ అక్షయ్ ఈ ప్రాజెక్ట్ చేస్తే.. దాన్ని ఎవరు తెరకెక్కిస్తారు అనేది మరింత ఆసక్తి రేకెత్తించే విషయం.మరి ఫ్యాన్స్ కోరిక అక్షయ్ వరకు వెళ్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.