Adipurush: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేసినంత విధంగా ఇప్పటివరకు ఏ సినిమాను ట్రోల్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సినిమా రిలీజ్ అయ్యి.. ఓటిటీకి వచ్చేవరకు ఏదో ఒక వివాదం ఆదిపురుష్ ను చుట్టుముడుతూనే ఉంది. ట్రోలర్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సినిమాలకు.. ఆదిపురుష్ ను పోల్చి ట్రోల్ చేయడం వరకు ఓకే కానీ, ఆదిపురుష్ బడ్జెట్ ను.. చంద్రయాన్ 3 బడ్జెట్ తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు అంటే.. అది వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. నేడు ఇండియా గర్వించదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే .. అది చంద్రయాన్ 3 ను ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పంపించారు. అది విజయవంతంగా దూసుకెళ్లడంతో భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Venky Re Release: వెంకీ రీరిలీజ్.. సీట్లు జాగ్రత్తమ్మా
ఇకపోతే.. చంద్రయాన్ 3 ను ఆకాశానికి పంపడానికి మొత్తం రూ. 615 కోట్లు ఖర్చు అయ్యినట్లు సమాచారం. అంటే ఆదిపురుష్ బడ్జెట్ కన్నా తక్కువ అని చెప్పుకొస్తున్నారు. ఆదిపురుష్ బడ్జెట్ వచ్చి.. రూ. 700 కోట్లు అని గూగుల్ చెప్పుకొస్తుంది. అంటే చంద్రయాన్ 3 కన్నా ఆదిపురుష్ బడ్జెట్ రూ.85 కోట్లు ఎక్కువ అన్నమాట. దీంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ఆపేసి మరో చంద్రయాన్ ను నింగికి పంపిస్తే.. ఇండియాకు మరో గర్వకారణంగా నిలిచేదని, ఆదిపురుష్ సినిమాను అంత డబ్బు ఖర్చు పెట్టి తీసి.. ప్రభాస్ కు భారీ ప్లాప్ ను అందించారు.. అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ నెట్టింట వైరల్ గా మారింది.