గత కొంత కాలంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగు వస్తుండగా.. ఈ రోజు ఉత్కంఠకు తెరపడింది.. పొత్తులపై తేల్చుకోవడానికి ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అయితే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య అవగాహన కుదిరింది.
శివరాత్రి, తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఏలూరు ఎంపీ అభ్యర్ధి సునీల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వారికి అమ్మవారి వస్త్రం, ప్రసాదం ఇచ్చి ఆశీర్వచనం చేశారు. దర్శనంతరం మంత్రి కారుమూరి.. బయటికొచ్చి ఎన్టీవీతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్ సింగిల్ గా వస్తారు... పొత్తులు పెట్టుకోరని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు.
ఉన్నవి చాలవన్నట్టు టీడీపీ నేతల మీద కొత్త కొత్త కేసులు పడబోతున్నాయా? ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్థులే టార్గెట్‌గా బుక్ అవుతాయని పార్టీ అనుమానిస్తోందా? టీడీపీ అధిష్టానానికి ఇప్పుడా డౌట్ ఎందుకు వచ్చింది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటోంది? అసలీ కొత్త కేసుల కథేంటి? ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రేపోమాపో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా 99 మంది అభ్యర్థులను ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు…
సీటూ మాదే… ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్ళుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్‌కి ఇప్పుడు సీట్లు చిరిగిపోతున్నాయా? కష్ట కాలంలో, క్లిష్ట సమయాల్లో సైతం గెల్చిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారయ్యారు? ఉమ్మడి వెస్ట్‌లో సూపర్ సీనియర్స్ అనుకున్నవారిని సైతం ఫస్ట్ లిస్ట్‌లో పార్టీ అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది? ఎవరా నేతకు? ఎందుకలా జరిగింది? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్‌కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. తమ రాజకీయ జీవితంలో…