Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 09 03 2024

Top Headlines @5PM : టాప్ న్యూస్

Published Date :March 9, 2024 , 5:07 pm
By Gogikar Sai Krishna
Top Headlines @5PM : టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ!

తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Also Read

  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
  • Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
  • SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
Add as a preferred
source on google

శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్‌ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ శాంతింపజేశారు.

ఏపీ 2024 ఎన్నికలు.. వర్గ పోరు కాదు.. కుల పోరు..!

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాకరేపుతున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సింగిల్‌గానే పోటీకి సిద్ధమైంది.. ఇక, కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల వ్యవహారం తేలాల్చి ఉంది.. అయితే, రాష్ట్రంలో తాజాగా పొత్తులపై సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి.. ఇప్పటికే మూడు పార్టీల పొత్తుపై సెటైర్లు వేసిన ఆయన.. ఇప్పుడు ”ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికలు వర్గ పోరు కాదు కుల పోరు! ” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ”వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పేద, బలహీనవర్గాల కలలను సాకారం చేసుకునేంత వరకు అండగా ఉండాలని కోరుకునే సీఎం వైఎస్‌ జగన్‌ పై.. అధికారాన్ని కేంద్రీకరించి నిలబెట్టుకోవాలనుకునే ధనవంతుల మధ్య పోటీ” అంటూ విపక్షాల పేర్లు ప్రస్తావించకుండానే సెటైర్లు వేస్తూ ట్వీట్‌ చేశారు.

టీడీపీ, బీజేపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారు.. అడ్రస్‌లు వెతుక్కోవాల్సిందే..!

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి.. బీజేపీ అంటే భగ్గుమనే కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు కలపడాన్ని తప్పుపడుతోంది.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు విశ్వాస ఘాతుక పొత్తుగా పేర్కొన్నారు.. ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు ప్రజలకు వెన్నుపోటుగా అభివర్ణించిన ఆయన.. జాతీయ స్ధాయిలో పొత్తులు పొడుస్తున్నాయంటే సంకీర్ణ పరిస్థితులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ గెలుస్తామన్న నమ్మకం కోల్పోయింది.. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు.

సింగిల్గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం..

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలు చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారని అన్నారు.

గతంలో లాగా జన్మభూమి కమిటీలు పెట్టీ ప్రజలను దోచుకున్న పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా..? అని ప్రశ్నించారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి టీడీపీ హయాంలో ఏమి అభివృద్ధి చేశారు ? అని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు, అందుకే వివిధ పార్టీలను ఊదకట్టెలు లాగా తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు.

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. పార్టీ వీడిన మార్నేని రవీందర్ రావు దంపతులు

బీఆర్‌ఎస్ పార్టీకి మ‌రో భారీ షాక్ తగిలింది. నిన్ననే మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్‌ను వీడుతున్న అని ప్రకటించిన మరునాడు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి మ‌రికొద్దిసేప‌టి క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ స‌ల‌హాదారు, మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డి సంక్షేమ లో రవీందర్ రావు, మధుమతి దంపతులు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం కేసీఅర్ కుటుంబానికి సన్నిహితుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రధాన అనుచ‌రుడిగా ఉన్న మార్నేని ఎన్నిక‌ల అనంత‌రం నాటి నుంచి పార్టీ మారుతాడ‌న్న ప్రచారం విస్తృతంగా జ‌రుగుతోంది.

టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్..

టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. 3 రోజుల నుండి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

అస్సాం టీ గార్డెన్‌ను ఆస్వాదించిన మోడీ

అస్సాంలో (Assam) ప్రధాని మోడీ (PM Modi) పర్యటిస్తున్నారు. రెండ్రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మోడీ శుక్రవారం అస్సాం చేరుకున్నారు. ఈ ఉదయం కజిరంగా నేషనల్ పార్క్‌ సందర్శించారు. అనంతరం ఏనుగుపై స్వారీ చేశారు. కొంత సేపు జీపులో కూడా ప్రయాణం చేశారు. కాజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడ పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మధ్యాహ్నం అస్సాంలోని టీ గార్డెన్‌ను (Tea Estate) కూడా ప్రధాని మోడీ సందర్శించారు. అక్కడ కొంత సమయం గడిపారు. టీ ఉత్పత్తులను గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు.. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం..

వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వని రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన కలిగిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది.. ఎవరికి ఏ స్థాయి లో ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే ఇస్తామని ఆమె అన్నారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాలని ఆమె కోరారు.

కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావును జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తామన్నారు. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి అని, మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారన్నారు. కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదని, నిన్న ఒక ఊరుకు పోతే కరెంట్ కోతలు మొదలు అయ్యాయని రైతులు అవేదన చెందారన్నారు. పదేళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నామని, వంద రోజుల్లో 13 హామీలు అన్నారు. 9 తారీఖు రుణమాఫీ అన్నారని, ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని హరీష్‌ రావు విమర్శించారు.

ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్..

ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. తాడేపల్లిలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో వైసీపీ ముఖ్యుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.

ఉత్తరాంధ్రలోని మొత్తం 34 నియోజకవర్గాలకు 25 స్థానాలు కైవసం చేసుకోవాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచార సభలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఏఏ ప్రాంతాల్లో సీఎం జగన్ సభలు నిర్వహించాలన్న దానిపై నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పాల్గొనే సభల షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఉత్తరాంధ్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chandrababu
  • cm jagan
  • CM Revanth Reddy
  • Narendra Modi
  • telugu news

తాజావార్తలు

  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు

  • Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్‌కు స్టాలిన్, పళనిస్వామి చెక్!

  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!

  • Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన

  • Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions