సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుండి గెంటేస్తారని అన్నారు కొడాలి నాని. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రెండున్నర దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన ఉమ.. కొద్ది రోజుల తర్వాతైనా పార్టీ లైన్ లోకి వస్తారని భావిస్తున్నాను.. ఉమ పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అయితే, నా టార్గెట్ గా ఉమ పని చేస్తే తగిన సమయంలో సమాధానం చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు
నేడు మంగళగిరిలో టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఏఎన్‌యూ ఎదురుగా ఉన్న స్థలంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరవనున్నారు. బీసీల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ…
రాష్ట్ర డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు. 2019 తరువాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని లేఖలో కోరారు.