టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
ఇంటింటికి మంచి నీటి కుళాయిలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ మహిళల కోసం ప్రవేశ పెట్టాం.. ఇప్పుడు విద్యార్ధినుల కోసం కలలకు రెక్కలు పేరుతో మరో పథకం ప్రవేశపెట్టాం.. పేద విద్యార్థినులు కలల సాకారం చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి.. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా మేం సహకరిస్తామన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్ తో పాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును నెల్లూరులోని అతిధి గ్రౌండ్ హోటల్లో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ అనుభవాన్ని జోడించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా.. టీడీపీ, జనసేన, బీజేపీలు ( TDP- Janasena- BJP ) కలిసి పోటీ చేసి ఎంపీగా గెలిచినా అందరూ మోడీకే ఓట్లేస్తారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ( CPI Ramakrishna ) ఆరోపించారు.