Chandrababu Praja Galam: నేటి నుంచి ప్రజాగళం.. సొంత జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Praja Galam: ఓవైపు వేసవిలో ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి.. మరోవైపు ఎన్నికలు హీట్ కూడా హీర్ పెంచుతున్నాయి.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశాయి. ఇక ప్రచారం ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజాగళం పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనుంది తెలుగుదేశం పార్టీ..
అందులో భాగంగా ముందుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు.. తనకు లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పని చేయాలని కేడర్‌కు దిశ నిర్దేశం చేయానున్నారు బాబు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ ప్రాంతంలో బాబు ప్రచారం ఉంటుంది. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో ప్రచారం చేస్తారు. 29న శైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం కొనసాగుతుంది. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తీలో ప్రచారం చేస్తారు. 31వ కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.
Also Read
- Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
- 7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
కాగా, 1989 నుంచి కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు చంద్రబాబు. ఏడు సార్లు పోటీ చేసిన ఆయన… విజయం సాధిస్తూ వచ్చారు. 1994 నుంచి 2014 వరకూ చంద్రబాబు మెజార్టీ 45 వేలకు తగ్గలేదు. గత ఎన్నికల్లో మెజార్టీ 30 వేలకు పడిపోవడంతో.. ఈ సారి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సారి లక్ష ఓట్లు మెజార్టీ సాధించాలని పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు. దీనికి అనుగుణంగా నేతలు, కార్యకర్తల్ని సమాయత్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. మరోవైపు.. వైనాట్ కుప్పం అంటూ సీఎం వైఎస్ జగన్.. కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
-
Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?