టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశాం.. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు.
చంద్రబాబు బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు... ఇదో పెద్ద అబద్ధం అని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు.. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా అని ప్రశ్నించారు.
రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలోని ఏటుకురులో నిర్వహిస్తున్న మేమంత సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ జన సముద్రాన్ని చూస్తే మరో ప్రపంచం కనిపిస్తుందన్నారు. ఈ జన ప్రభంజనం చరిత్రలో నిలిచిపోతుంది.. ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తుంది.. మన ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు మంచినీ కొనసాగించేందుకు వైసీపీకి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు రెండు గంటల సేపు సాగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశం.. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరి అధికారుల పని తీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి నేతల భేటీలో ఒకట్రొండు స్థానాల్లో మార్పు చేర్పులపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి, తంబళ్లపల్లె, లాంటి స్థానాల్లో మార్పు చేర్పులపై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తుంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు మెడికల్ కళాశాల భూముల కొనుగోలులో నేను ఒక్క రూపాయి తీసుకున్నట్లు రుజువు చేస్తే పోటీ నుంచి విరమించుకుంటాను.. అలాగే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అందాల సీమను కలహాల సీమగా మార్చాడని దుయ్యబట్టారు. మళ్లీ ఈ పరిస్థితులు రాకుండా కాపాడుతామని పవన్ తెలిపారు. జగన్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుపరచలేదని ఆరోపించారు. మళ్లీ వైసీపీ ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయండని పేర్కొన్నారు.…
రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందిస్తూ వెల్కమ్ చెప్పారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి…